తాజా వార్తలు

10/recent/ticker-posts

కొయ్యలగూడెం మార్కెట్ యార్డ్ కమిటీ సమావేశం – “రైతన్న మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


కొయ్యలగూడెం, పశ్చిమవాహిని, మార్చి 16: కొయ్యలగూడెం మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన మార్కెట్ యార్డ్ కమిటీ సర్వసభ్య సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “రైతన్న మీకోసం” కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతులకు అందిస్తున్న ప్రత్యేక సేవలు, పథకాల వివరాలతో రూపొందించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. రైతులకు మెరుగైన ధరలు, మార్కెటింగ్ సౌకర్యాలు, సాగుకు అవసరమైన సాంకేతిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

అనంతరం “రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కారం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పంట బీమా, పంటలకు సరైన ధరలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మార్కెట్ యార్డుల అభివృద్ధి ద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, వైస్ చైర్మన్ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆకుల అరుణ, రాష్ట్ర ఎడ్యుకేషనల్ కమిటీ సభ్యురాలు పెండ్యాల రమాదేవి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకటరమణ, సొసైటీ ప్రెసిడెంట్లు దగ్గిన శ్రీనివాస్, యనమదల ప్రసాద్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి, టిడిపి మండల అధ్యక్షుడు పారేపల్లి రామారావు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గోలిశెట్టి వాసు, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి మద్ద తేజ, మన్నిడి సాయిబాబా, పారేపల్లి నరేష్, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ సెక్రటరీ ఉన్నమట్ల మోహన్, వ్యవసాయ శాఖ ఏడీ బుజ్జిబాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి పోసరావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో కిరణ్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ స్వాతి తదితరులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.