ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 18: జిల్లాలో కోకో పంట అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, రైతులు నాణ్యమైన ఉత్పత్తిపై దృష్టి పెడితే మంచి ధరలు పొందవచ్చని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.
పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కోకో మినిమల్ ప్రాసెసింగ్ పథకం కింద గుర్తించిన దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలాల రైతులకు ప్లాస్టిక్ ట్రేలు, పాలీషీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రైతులకు సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కోకో గింజల నాణ్యతను మెరుగుపరిస్తే మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తాయని చెప్పారు. రైతులు ప్లాస్టిక్ ట్రేలు, పిట్లు కొనుగోలు చేసి బిల్లులను గ్రామ రైతు సేవా కేంద్రాలలో సమర్పిస్తే 35 శాతం రాయితీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి షాజా నాయక్ మాట్లాడుతూ, కోకో గింజల ప్రాసెసింగ్ కోసం చెక్క పెట్టెలు, చెక్క బల్లలు తయారు చేసుకున్న రైతులకు కూడా బిల్లుల ఆధారంగా రాయితీ అందజేస్తామని తెలిపారు. దీంతో కోకో ప్రాసెసింగ్ మెరుగుపడి నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, అభ్యుదయ రైతులు, ఉద్యాన శాఖ



.jpeg)








