తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరులో వినూత్న ట్రాఫిక్ తనిఖీలు – హెల్మెట్ లేని వారికి అక్కడికక్కడే కొనుగోలు చేయించిన పోలీసులు


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: ఏలూరులో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు పోలీసులు వినూత్నంగా ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీకె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సూచనల మేరకు ఆశ్రమం హాస్పిటల్ సెంటర్ వద్ద ఈ తనిఖీలు చేపట్టారు.


ఈ కార్యక్రమాన్ని సత్యనారాయణ ఆధ్వర్యంలో, రూరల్ ఎస్ఐ నాగబాబు సిబ్బందితో కలిసి నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించకుండా, సామాజిక బాధ్యతగా అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి వినూత్నంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ నాగబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం యువతే ఉండటం ఆందోళనకరమని తెలిపారు. అతివేగం మరియు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం మానుకోవాలని సూచించారు.

అదే విధంగా మైనర్లకు వాహనాలు ఇస్తే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించకూడదని, నాణ్యమైన హెల్మెట్ ధరించడం మీ కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా అని స్పష్టం చేశారు.