జంగారెడ్డిగూడెం, పశ్చిమవాహిని, మార్చి 17: మెట్ట ప్రాంత కాపు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ ఏఎస్పీ సుస్మితా రాఘవన్ మంగళవారం ప్రారంభించారు. కాలేజీ రోడ్డులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీరు ప్రతి ఒక్కరికీ అత్యవసరమని, ఇలాంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవా సంఘాలు ఈ విధంగా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమాఖ్య గతంలో చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాల గురించి సంఘ ప్రతినిధి జెట్టి శైలజారాణి వివరించారు.
ఈ కార్యక్రమంలో జెట్టి శైలజారాణి, అడపా సులోచన రాణి, మోటేపల్లి సుజాత, వాసంశెట్టి రమ్య, శెట్టి రమాదేవి, పాలపర్తి నిర్మల, పద్మజ, యిళ్ళ సునీల, ఆకుల సీత, వరలక్ష్మి, విజయలక్ష్మి, చంద్ర, కుమారి, కే-9 సెక్రటరీ శీలం కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు హాజరయ్యారు.



.jpeg)








