సత్తుపల్లి, పశ్చిమ వాహిని, మార్చి 14: సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు సుమారు 88 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ఈ ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
అనంతరం గ్రామంలో తాళ్లూరు మురళి, నాగమణి దంపతుల ఇందిరమ్మ ఇల్లు మరియు తోకల చుక్కమ్మ–లక్ష్మయ్య దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పాల్గొన్నారు. అలాగే అమరం రాము కుటుంబంలో జరిగిన మనవడి బారసాల కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ చౌదరి, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్, పాత పినపాక సర్పంచ్ గుర్రం శ్రీను, ఉపసర్పంచ్ స్వరూపరాణి, తల్లాడ మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.








