తాజా వార్తలు

10/recent/ticker-posts

కల్లూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన – పారిశుధ్య పనుల పరిశీలన, రంజాన్ తోఫా పంపిణీ


కల్లూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మున్సిపాలిటీలో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కల్లూరు మున్సిపాలిటీ 4వ వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన శుభ్రత పనులను పరిశీలిస్తూ పట్టణ పరిశుభ్రతకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.


అనంతరం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని మసీద్‌ను సందర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు “రంజాన్ తోఫా”ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరి, మున్సిపల్ కౌన్సిలర్లు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ చౌదరి, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు పట్టణం మరియు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.