టి. నర్సాపురం, పశ్చిమ వాహిని, మార్చి 14: టి. నర్సాపురం మండలం మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు అడప నాగరాజు అధ్యక్షత వహించగా, పార్టీ సీనియర్ నాయకులు సి. హెచ్. నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో అడపా నాగరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు కొనియాడారు.
ఈ వేడుకల్లో సీనియర్ నాయకులు సీహెచ్ నవీన్ చురుకైన పాత్ర పోషించారు. పార్టీ సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించడంతో పాటు కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. నవీన్ నేతృత్వంలో కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ పార్టీ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఎంపీటీసీ ఆళ్ల బాలాజీ, సొసైటీ డైరెక్టర్లు మధ్యాహ్నపు వేణు, దాసరి నాని పాల్గొన్నారు. అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు పాలేటి సత్తిబాబు, కంపసాటి రమేష్, మాండ్రు రాము, నోముల యువరాజు, హరి, పబ్బు జయరాజు, పల్లగాని పోతురాజు, దించినాల బ్రహ్మం, ఉప్పులూరి సతీష్, రాఘవరాజు సురేష్, తోట సాయి, కన్నం సర్వేశ్వరరావు, పెద్దింటి చంటి తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మండల కేంద్రం మొత్తం జనసేన జెండాలతో, కార్యకర్తల కోలాహలంతో పండుగ వాతావరణాన్ని తలపించింది.








