తాజా వార్తలు

10/recent/ticker-posts

పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కానుక – బొర్రంపాలెం హైస్కూల్‌లో పరీక్షా సామగ్రి పంపిణీ


టి. నర్సాపురం, బోరంపాలెం, పశ్చిమ వాహిని, మార్చి 14: టి. నర్సాపురం మండలంలోని బోరంపాలెం గ్రామంలోని పీఎంసీ జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా చిర్రి బాలరాజు ప్రత్యేక కానుక అందించారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఎమ్మెల్యే పంపించిన రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు, స్కేల్స్‌ను శుక్రవారం పంపిణీ చేశారు.


ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన ప్రతినిధులు, స్థానిక నాయకులు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే అందించిన ఈ కానుకపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.కె.యండి ఆలీ, పాఠశాల చైర్మన్ కంపసాటి రమేష్, ఉపాధ్యాయ సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచి చదువుకు అవసరమైన సామగ్రి అందజేసినందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.