పెదపాడు, పశ్చిమవాహిని, మార్చి 16: తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పెదపాడు శాఖా గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పెదపాడు హైస్కూల్ సోషల్ టీచర్ నాగరాజు కార్యక్రమంలో పాల్గొని పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలు, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగం గురించి విద్యార్థులకు వివరించారు.
తెలుగు భాషా ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటుకు పోరాడి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా పొట్టి శ్రీరాములు చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఆయన త్యాగస్ఫూర్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు.



.jpeg)








