ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: ఏలూరులోని పత్తెబాద నాలుగు గుళ్ల సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాక్స్ స్టైల్ హబ్ సెలూన్‌ను బడేటి చంటి మరియు యువ హీరో ఆకాష్ పూరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హబ్ యజమానులు ఎస్‌విఎల్ఎస్ రంగారావు, బుద్దాల శ్రీరామ్ అతిథులకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ఏలూరు నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో నూతన స్టైలిష్ సెలూన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న తల్వార్ సినిమా షూటింగ్ కొనసాగుతోందని, అనంతరం ఒక కామెడీ చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడీఏ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గభవాని శ్రీనివాస్, కార్పొరేటర్లు నాయుడు సోము శారద, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.








