ద్వారకాతిరుమల, పశ్చిమవాహిని, మార్చి 17: మండలంలోని జి.కొత్తపల్లి గ్రామ సొసైటీ అధ్యక్షుడు రాగంటి రాంబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రజా బంధువు సుంకర ఆంజనేయులు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజు హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణల మధ్య భారీ కేక్ కట్ చేసి ప్రత్యేకంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు సుంకర ఆంజనేయులు ఫలహారం, స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు సుంకర ఆంజనేయులు చేతుల మీదుగా ప్రత్యేక బహుమతులు అందజేశారు. రాగంటి రాంబాబు జన్మదిన వేడుకలను ఆంజనేయులు అన్ని తానై ముందుండి ఘనంగా నిర్వహించారు. అలాగే పలువురికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కూటమి బలోపేతం అవుతోందని నాయకులు తెలిపారు.
పార్టీ కార్యక్రమాలను తన ప్రాణప్రదంగా భావిస్తూ పార్టీ అభివృద్ధి కోసం సుంకర ఆంజనేయులు నిరంతరం కృషి చేస్తున్నారని కూటమి నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు దిశాలువా కప్పి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సుంకర ఆంజనేయులు మాట్లాడుతూ భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, తన ప్రాణం ఉన్నంత వరకు పేదల సేవలో కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు చేతుల మీదుగా రైతులకు ఉపయోగపడే షాపును సుంకర ఆంజనేయులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



.jpeg)








