జీలుగుమిల్లి, పశ్చిమవాహిని, మార్చి 17: రంజాన్ మాసం సందర్భంగా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలోని స్థానిక మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు.
మసీదుకు చేరుకున్న ఎమ్మెల్యేకు ముస్లిం పెద్దలు, సోదరులు హృదయపూర్వక స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని స్నేహభావాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీక అని తెలిపారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు కలిసి పండుగలను జరుపుకోవడం భారతీయ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, గ్రామ సర్పంచ్ సరియం రాజు, సరియం ముత్యాలరావు, కొప్పుల శ్రీకాంత్, కోలా మధు, పాలోజి పండు, నారగాని నరేంద్ర, జిలుగుల శివ, సొంటి రామకృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చాప రవి, టీడీపీ నాయకులు ఉండవల్లి సోమసుందరం తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



.jpeg)








