తాజా వార్తలు

10/recent/ticker-posts

ఉస్తాద్ భగత్ సింగ్

Movie Review: ఉస్తాద్ భగత్ సింగ్

By PASCHIMA VAHINI NEWS | March 30, 2026
Rating: 3/5 ⭐⭐⭐
నటీనటులు

Director
హరీష్ శంకర్

Producer
నవీన్ యెర్నేని - వై.రవిశంకర్

Hero
పవన్ కళ్యాణ్

Heroine
శ్రీలీల

Music
దేవిశ్రీ ప్రసాద్

Date of Release

2026-03-19

Synopsis

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.

నటీనటులు

పవన్ కళ్యాణ్ - శ్రీలీల - రాశి ఖన్నా - పార్తీబన్ - కేఎస్ రవికుమార్ - రావు రమేష్ - ప్రభాస్ శీను - ప్రవీణ్ - సత్యం రాజేష్- గౌతమి తదితరులు

కథ

భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) ఒక అనాథ. అతడిని ఆదరించి అన్నీ చూసుకున్న గురువు చంద్రశేఖర రావు (కేఎస్ రవికుమార్) తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి సీఎం అవుతాడు. కానీ తాను సీఎం అవ్వాలని చూస్తున్న నల్ల నాగప్ప (పార్తీబన్).. ముఖ్యమంత్రి మీద దాడి చేస్తాడు. తాను సీఎం కుర్చీలో కూర్చుంటాడు. ఈ స్థితిలో భగత్ రంగంలోకి దిగుతాడు. దిగాక అతను ఏం చేశాడు? నల్ల నాగప్పతో అతడి గొడవ ఎక్కడి దాకా వెళ్ళింది? పూర్వాశ్రమంలో భగత్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెర మీదే తెలుసుకోవాలి.

Advertisement
కథనం - విశ్లేషణ

స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడో కానీ కొత్త కథలు ఆశించలేం. కథ పాతగా ఉన్నా సరే.. ఎలివేషన్లు సరిగా కుదిరితే.. కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ పడితే.. కమర్షియల్ మసాలాలు కూడా తోడైతే.. అది పైసా వసూల్ సినిమాలా తయారవుతుంది. అభిమానులు.. మాస్ ప్రేక్షకులు కనెక్టయితే బాక్సాఫీస్ ఫలితం కూడా ఆశించిన స్థాయిలో వస్తుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఈ తరహా సినిమాగా మలచడానికే ప్రయత్నించాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈసారి అతడికి ‘దబంగ్’లా మంచి అరువు కథ దొరకలేదు. అతను ఒకప్పుడంత గొప్ప ఫాంలోనూ లేడు. సొంత కథతో.. ఇప్పుడున్న ఫాంలో తన వంతుగా గట్టి ప్రయత్నమే చేశాడు. రొటీన్ టెంప్లేట్లో సాగే సినిమానే అయినా.. పవన్ అభిమానులను-మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలకైతే ఇందులో లోటు లేదు. ఇది సూపర్ అనిపించే సినిమా కాదు. అలా అని బాలేదు అన్న ఫీలింగ్ కూడా కలిగించదు. రెండున్నర గంటలు అలా అలా టైంపాస్ చేయించి.. జస్ట్ ఓకే అన్న భావన కలిగిస్తుంది. స్టార్ హీరోల సినిమాలంటే కొత్త కథల కోసం బుర్రలు బద్దలు కొట్టుకోవడం కంటే ఆల్రెడీ చూసిన కథలనే ఇటు అటు తిప్పి వడ్డించేయడం కమర్షియల్ డైరెక్టర్లకు అలవాటే. ఐతే ప్రతిసారీ కొత్త కథ కూడా అవసరం లేదు. పాత కథనే కొత్త ట్రీట్మెంట్ తో చెప్పొచ్చు. పవన్ చివరి చిత్రం ‘ఓజీ’ సంగతే తీసుకుంటే.. అదేం కొత్త కథ కాదు. కానీ సుజీత్ ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్.. తన టేకింగ్.. పవన్‌ ను ప్రెజెంట్ చేసిన విధానం అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. సామాన్య ప్రేక్షకులకు కూడా అది డీసెంట్ గానే అనిపించింది. హరీష్ శంకర్ నుంచి ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్.. అందులోనూ తన కెరీర్లో ఈ దశలో ఎవరూ ఆశించరు కానీ.. ‘గబ్బర్ సింగ్’లో చూపించిన మెరుపులను మాత్రం కోరుకుంటారు. కానీ హరీష్ ఆ స్థాయిలో ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తలేకపోయాడు. అప్పుడు ‘దబంగ్’ను పవన్ శైలికి తగ్గట్లుగా అద్భుతంగా పవరీకరించిన హరీష్ శంకర్.. ఈసారి సొంత కథతో ఓ మోస్తరుగా అనిపించే వంటకం వడ్డించాడు. హీరోకు ఒక గతం.. అందులో విలన్ తో వైరం.. ఆపై ఒక విషాదం.. దానికి బదులుగా ప్రతీకారం.. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న కమర్షియల్ ఫార్మాట్లోనే అతను వెళ్లిపోయాడు. ఐతే ఈ ఫార్మాట్లోనే వినోదాన్ని పంచేలా సన్నివేశాలు రాసుకున్నాడు. పవన్ సీరియస్ స్టైల్ విడిచిపెట్టి సరదాగా కనిపించడం.. మళ్లీ తన పాత మేనరిజమ్స్ అన్నీ చూపించడం.. హరీష్ మార్కు పంచ్ డైలాగులకు తన స్టైల్ జోడించి పేల్చడం వల్ల.. సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. మధ్య మధ్యలో పవన్ హుషారుగా స్టెప్పులేసిన పాటల వల్ల కూడా అభిమానులు ఎంటర్టైన్ అవుతారు. పాటలతో మెడ్లీ పెట్టడం అన్నది చాలా సినిమాల్లో చూసిన వ్యవహారమే అయినా.. పవన్ చేయడం వల్ల అది ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పవన్-శ్రీలీల రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. అది కూడా కొత్తగా అనిపించకపోయినా.. వినోదాన్ని పంచుతుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే ‘తొలిప్రేమ’ పాట అభిమానులను చాలా ఏళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. సినిమాకు దీన్ని మేజర్ హైలైట్ గా చెప్పొచ్చు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో పాత బస్తీకి వెళ్లి టెర్రరిస్టును పట్టుకొచ్చే ఎపిసోడ్.. విలన్ ఇంటికి వెళ్లి అతడికి పెద్ద షాకిచ్చే సన్నివేశం.. అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తాయి. ముఖ్యంగా పాత బస్తీ ఎపిసోడ్లో వాస్తవ పరిస్థితులకు దగ్గరగా.. జాగ్రత్తగా హరీష్ రాసిన డైలాగులు బాగా పేలాయి. ప్రథమార్ధం వరకు సోసోగా అనిపించే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ద్వితీయార్ధంలో మాత్రం గ్రాఫ్ పెంచుకుంటుంది. క్లైమాక్స్ మామూలుగా అనిపించినా.. ఓవరాల్ గా సినిమా నాట్ బ్యాడ్ అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. ఇది కొత్త సినిమా కాదు.. వారెవా అనిపించదు. అదే సమయంలో భరించలేని విధంగా లేదు. టైంపాస్ వినోదానికి ఢోకా లేదు. అభిమానులకైతే ‘ఉస్తాద్’ పైసా వసూల్ అనే అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం

‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ అంటే.. పాటల మీద చాలా అంచనాలు పెట్టుకుంటాం. కానీ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడిచ్చిన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎత్తరా ఎత్తరా.. దేఖ్ లేంగే సాలా.. పాటలు కొంచెం హుషారు పుట్టిస్తాయి. తమన్ నేపథ్య సంగీతం కమర్షియల్ సినిమాల ఫార్మాట్లో సాగింది. కొన్ని చోట్ల మరీ లౌడ్ బీజీఎంతో ఇబ్బంది పెట్టాడు. కొన్నిచోట్ల ఓకే అనిపించాడు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. దశరథ్-రమేష్ రెడ్డిలతో కలిసి హరీష్ శంకర్ వండిన స్క్రిప్టులో కొత్తదనం లేదు కానీ.. పవన్ శైలికి తగ్గ ఎంటర్టైనింగ్.. ఎలివేషన్ సీన్ల మీద బండి నడిపించాడు. హరీష్ డైలాగులు బాగానే పేలాయి. ‘ఓజీ’ స్థాయిలో కాదు కానీ.. పవన్ ను అభిమానులు మెచ్చేలా చూపించాడు. ఆయన్నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. హరీష్ టేకింగ్ కొత్తగా అయితే అనిపించదు.

Advertisement
Plus Points
  • Good visuals
  • Background music
Minus Points
  • Weak story
Trailer
చివరగా

ఉస్తాద్ భగత్ సింగ్.. ఫ్యాన్స్ స్టఫ్

Rating: 2.5/5 ⭐⭐⭐
రేటింగ్

3/5