తాజా వార్తలు

10/recent/ticker-posts

మసీదులకు రూ.45 కోట్ల బకాయిల విడుదల… రాష్ట్రవ్యాప్తంగా నిధుల జమ


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 5,000 మసీదులకు అక్టోబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.45 కోట్లను సంబంధిత మసీదుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ కరిముల్లా తెలిపారు.


ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మసీదులకు కూడా ఈ నిధులు విడుదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని 207 మసీదులకు 6 నెలల కాలానికి సంబంధించిన రూ.1,86,30,000 మొత్తాన్ని సంబంధిత ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.

ఈ సందర్భంగా వక్ఫ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ కరిముల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మసీదుల నిర్వహణ, అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని అన్నారు.