తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా – భారీ బైక్ ర్యాలీ, బహిరంగ సభ


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఏలూరు–దెందులూరు నియోజకవర్గాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం అగ్రహారంలోని మర్చంట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకట లక్ష్మి హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో సమావేశమయ్యారు.


సభలో నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు. ప్రజల తరఫున ధైర్యంగా పోరాడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో రెడ్డి అప్పల నాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మి వంటి నాయకులు ప్రజాసేవలో ముందుండి పనిచేస్తూ ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రెడ్డి అప్పల నాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మి రాష్ట్ర ప్రజల కోసం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలు మరువలేనివని తెలిపారు. సౌఖ్యమైన జీవితాన్ని వదిలి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ తనకు అప్పగించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పాత్ర విశేషమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, నగర గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, మేడిచర్ల కృష్ణ, మోటేపల్లి పవన్ హరిచంద్ర కుమార్, పసుపులేటి భార్గవ్, తాటపూడి చందు, మేడేపల్లి రామ్మోహన్రావు, జల్లీ తేజసాయి తదితర నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.