తాజా వార్తలు

10/recent/ticker-posts

టి.నరసాపురంలో ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు


టి.నరసాపురం, పశ్చిమవాహిని, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను టి.నరసాపురంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు అద్దంకి గిరి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముందుగా అధ్యక్షుడు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మండల యువజన సంఘం అధ్యక్షుడు పసుమర్తి రాము మాట్లాడుతూ, తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం సాధనకు పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 1952 డిసెంబర్ 15న ప్రాణత్యాగం చేసిన మహానుభావుడని తెలిపారు.


ఆయన త్యాగ ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో తొలి భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పడిందని గుర్తుచేశారు. ఈ విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండం ఆదిత్య, అద్దంకి జగ్గారావు, అద్దంకి రవికుమార్, కొనకళ్ళ శ్రీను, వంటిపల్లి సురేష్, బచ్చు కోటేశ్వరరావు, మాదంశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.