ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: “అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది” అని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఏలూరు సర్వజన సమ్మేళనం దక్షిణపు వీధిలో ఘనంగా జరుగుతున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా గురువారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డి అప్పలనాయుడు తన చేతుల మీదుగా అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దక్షిణపు వీధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన జాతర మహోత్సవం ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.
జాతర కమిటీ సభ్యులంతా సమన్వయంతో పనిచేసి మహోత్సవాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. మంచి సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించే ఈ జాతర నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రెడ్డి అప్పలనాయుడు సహకారం జాతర విజయవంతానికి కీలకమైందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతు అందిస్తున్న ఆయన సేవలను కొనియాడారు. జాతర సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ కరణం గణేష్, జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య, కమిటీ అధ్యక్షులు అద్దేపల్లి వెంకటేశ్వరరావు, సభ్యులు నగిరెడ్డి కాశీ నరేష్, పండు నాయుడు పాల్గొన్నారు. అదనంగా జనసేన నాయకులు కూనిశెట్టి మురళీకృష్ణ, బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణం కుమార్, వివిధ డివిజన్ ఇన్‌చార్జులు, కూటమి పార్టీల నాయకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







