ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: ఏలూరు నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి పుట్టినరోజు సందర్భంగా నగరవ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చంటి, శాసనసభ సమావేశాలకు హాజరైనప్పటికీ ఆయన తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ నాయకులు, అభిమానులు ఆదర్శంగా నిలిచారు.
పలుచోట్ల కేక్ కటింగ్‌లు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలతో నగరం సందడిగా మారింది. పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే సోదరుడు, రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బడేటి వెంకట్రామయ్య మరియు ఎమ్మెల్యే సతీమణి బడేటి మీనా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
అనంతరం ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ ప్రారంభించారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వైద్యులు పాల్గొని వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయాలని నిర్ణయించారు. పలువురికి ఉచితంగా కళ్లజోళ్ళు పంపిణీ చేశారు. జనరల్ ఫిజిషియన్ల ఆధ్వర్యంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను మాజీ మంత్రి మరడాని రంగారావు చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు.
బడేటి ట్రస్ట్ ఆధ్వర్యంలో 22 మంది పేదలకు తోపుడు బళ్ళు, ముగ్గురికి కుట్టు మిషన్లు, ఒక వికలాంగునికి వీల్ చైర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడేటి వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా ఎమ్మెల్యే చంటి సూచనల మేరకు అవసరార్థులకు ఉపయుక్తమైన సేవలు అందించామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సతీమణి మీనా మాట్లాడుతూ తన భర్త ఆకాంక్షకు అనుగుణంగా పుట్టినరోజున పేదలకు సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ “బడేటి అంటే భరోసా” అన్న నానుడికి తగ్గట్టుగా పేదల సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఎఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, నగర టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్ తదితరులు ఎమ్మెల్యే సేవలను ప్రశంసించారు. మహిళా నాయకులు తవ్వా అరుణకుమారి, కడియాల విజయలక్ష్మి కూడా సేవాగుణాన్ని అభినందించారు.
కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు మీరావలీ, జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్‌బాబు, నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, మోటేపల్లి చంద్రశేఖర్, కోటేశ్వరమ్మ దంపతులు, బెల్లపుకొండ కిషోర్, శ్రీలక్ష్మి దంపతులు, ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్లు, క్లస్టర్, డివిజన్, బూత్ ఇన్‌చార్జులు, అనుబంధ సంఘాల సభ్యులు, కూటమి పార్టీల నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజల మన్ననలు పొందారు.







