ఆలమూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: ఈనెల 8వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్ ఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ మదర్ తెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల విజేతల వివరాలు బ్లూ బెల్ట్ ఏ విభాగంలో గెద్దాడ జాయ్ కిరణ్, గోల్డ్ మెడల్ బ్లూ బెల్ట్ బి విభాగంలో గుత్తుల షణ్ముఖ, సిల్వర్ మెడల్, ఎల్లో బెల్ట్ బి విభాగంలో కోడూరి శ్రీ ఉదయ కృష్ణ దుర్గ సాకేత్, గోల్డ్ సాధించగా అదేవిధంగా ఇటీవల కాకినాడలో జరిగిన కరాటే టైక్వాండో బ్రౌన్ బెల్ట్ ఏ భాగంలో బుంగ అశ్విన్, గోల్డ్ మెడల్, సి విభాగంలో గెద్దాడ మనస్వి సిల్వర్ మెడలు సాధించినట్లు కోచ్ మెరిపే సత్య కాంత్ తెలిపారు.
విజయాలు సాధించిన విద్యార్థులను గురువారం నాడు స్థానిక కొత్తూరు సెంటర్ కరాటే అకాడమీలో టైక్వాండో విజేతలను మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సలాది నాగేశ్వరరావు విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ఆత్మ రక్షణకు కరాటే, కుంగ్ ఫూ, తైక్వాండో, బాక్సింగ్ వంటి మార్షల్ ఆర్ట్స్ కళలను నేర్చుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సీనియర్ గ్రాండ్ మాస్టర్ తాతపూడి అబ్బులు, కోచ్ సత్యకాంత్ గెద్దాడ ప్రసాద్, పెయ్యల సత్యనారాయణ, పాల్గొన్నారు. విద్యార్థులను సీనియర్ కోచ్ లక్ష్మీ సందీప్ కిరణ్, మాస్టర్ వెంకటలక్ష్మి తదితరులు అభినందించారు.







