తాజా వార్తలు

10/recent/ticker-posts

మత్తు మందు ఇచ్చి బంగారం దొంగతనం చేసిన మహిళకు జైలు శిక్ష...


ప్రభుత్వం తరఫున చాకచక్యంగా వాదనలు వినిపించిన జిల్లా కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కప్పల సునీల్ కుమార్..


రామచంద్రపురం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: మత్తు మందు ఇచ్చి బంగారం దొంగతనం చేసిన వేర్వేరు కేసులలో మహిళకు  మూడు సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ 2000 జరిమానా విధిస్తూ రామచంద్రపురం 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి ఆనంది గురువారం తీర్పు వెలువరించారు. అనపర్తి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.187/2024, అలాగే బిక్కవోలు పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెం.109/2023 కేసులలో ముద్దాయి అయిన నడిపల్లి సూర్య చంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జమ్మ పై సమగ్ర విచారణ అనంతరం ఆమెకు ఒక్కక్క కేసులో 3 (మూడు) సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.2,000/- జరిమానా విధిస్తూ శిక్షను ఖరారు చేసారు. 

ఈ కేసును కె రామారావు అప్పటి సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అనపర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, ముద్దాయిని అరెస్ట్ చేశారు. తదనంతరం విచారణ బాధ్యతలను స్వీకరించిన ఎల్ శ్రీను నాయక్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కోర్టు కానిస్టేబుల్ డబ్ల్యూ పిసి-1482 రత్నకుమారి ద్వారా సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి, కేసు బలంగా నిలబడేలా చర్యలు చేపట్టారు. 

అలానే అప్పటి బిక్కవోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బుజ్జి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ముద్దాయిని అరెస్ట్ చేశారు. కోర్టు కానిస్టేబుల్ డబ్ల్యుపీసీ మహాలక్ష్మి న్యాయస్థానంలో సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ తరఫున వాదించిన రామచంద్రపురం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. సునీల్ కుమార్ సమర్థవంతమైన వాదనలతో కేసును దృఢంగా నిలబెట్టి, ముద్దాయికి శిక్ష పడేలా చేయడంలో కీలక పాత్రపోషించారు. 

నేరం రుజువు కావడంతో నిందితురాలికి వేర్వేరుగా మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటుగా 2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జీ ఆనంది తీర్పు ఇచ్చారు. పోలీస్ శాఖ, ప్రాసిక్యూషన్ సమన్వయంతో న్యాయం సాధ్యమైందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో అనపర్తి పోలీస్ స్టేషన్, బిక్కవోలు పోలీస్ స్టేషన్ నిరంతరం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.