తాజా వార్తలు

10/recent/ticker-posts

మామిడికుదురు అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాను - రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్


మామిడికుదురు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: మామిడికుదురు గ్రామం (ఆల్ క్యాస్ట్ కాలనీ) నందు గ్యాస్ స్టవ్ వలన అగ్నిప్రమాదం ఈరోజు మధ్యాహ్నం జరిగింది. ఎరుకల షెడ్యూల్ కులానికి చెందిన వారి 11 తాటాకు ఇళ్ళు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిప్రమాద ఘటన తెలిసిన వెంటనే నేరుగా అసెంబ్లీ నుండి మామిడికుదురు వచ్చి బాధితులను పరామర్శించి అండగా ఉంటాను అని  గౌరవ శాసన సభ్యులు శ్రీ దేవ వరప్రసాద్  తెలిపారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ కట్టుబట్టలతో  రోడ్డును పడ్డ ఈ 14 కుటుంబాలకు అండగా ఉంటానని దాదాపు 40 మంది ఇక్కడ నివాసం ఉంటున్నారని వారందరికీ కూడా వసతి మరియు భోజన సౌకర్యం కల్పిస్తామని, నిత్యవసరాలైన దుస్తులు, దుప్పట్లు తదితర సామాగ్రిని ఎన్డీఏ కూటమి నాయకులు కూడా సమకూరుస్తారని తెలిపారు. ప్రభుత్వ పరంగా అందేటటువంటి సాయాన్ని సకాలంలో అందించి బాధితులను ఆదుకుంటానని తెలిపారు. 

అధికారులతో మాట్లాడి వీరికి స్థలాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తానని నాయకులు అందరూ వీరికి అండగా నిలబడాలని సూచించారు. నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు. గౌరవ శాసన సభ్యుల వెంట ఎన్డీఏ కూటమి నాయకులు, సంబంధిత అధికారులు ఉన్నారు.