ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు హెచ్చరిక
ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెలించుకొక తప్పదని ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు హెచ్చరించారు. తక్షణమే కేంద్రం లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కు మున్సిపల్ కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ఆర్ పేట లో ఉన్న ఏఐటీయూసీ జిల్లా ఆఫీసు స్ఫూర్తి భవన్ లో యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలను చేస్తూ కార్పొరేట్ శక్తులకు, కాంట్రాక్ట్ దళారులకు అనుకూలంగా 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మికవర్గానికి అణచివేయదానికి చేస్తున్న కుట్ర అని విమర్శించారు. ఈ లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు పాల్గొంటున్నారని చెప్పారు.
అంతేకాకుండా భారతదేశంలో ఉన్న మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. అందువల్ల 12వ తేదీన జరిగే కార్మిక ప్రదర్శనలో మున్సిపల్ కార్మికులు అగ్రభాగాన్న ఉండి సమ్మెను విజయవంతం చేయాలని భజంత్రి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ ముఖ్య కార్యకర్తలు దొడ్డిగర్ల నాగబాబు, వంశీ, కాకాని సుబ్బారావు, జానకిరామ్, శివకుమార్, మల్లేశ్వరరావు, గూడుపు దుర్గారావు, మోసేషు భాస్కరరావు, సురేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.







