తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రముఖ వైద్యులు డాక్టర్ తాతారావు మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం


నిడదవోలు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: నిడదవోలు ప్రాంత ప్రజల పెన్నిధి, ప్రముఖ వైద్యులు డాక్టర్ తాతారావు  మృతి పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. డాక్టర్ తాతారావు కేవలం వైద్యుడిగానే కాకుండా, ఒక గొప్ప మానవతావాదిగా నిడదవోలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. 

ఆయన మరణం వైద్య రంగానికి, ముఖ్యంగా నిడదవోలు ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. "అమ్మ హాస్పిటల్" ద్వారా వైద్య సేవలనే కాకుండా, పేదలకు అండగా నిలిచి ఆసుపత్రిని ఒక సేవా మందిరంగా మార్చిన మహోన్నత వ్యక్తి తాతారావు అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. వేలాది మందికి ప్రాణదానం చేసిన ఆయనను ప్రజలందరూ ఒక తండ్రిలా, గురువులా భావిస్తారని మంత్రి దుర్గేష్ గుర్తు చేసుకున్నారు. 

ఆయన క్రమశిక్షణ, సేవా గుణం, చిరునవ్వు రాబోయే తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు."శారీరకంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మన స్మృతిలో ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.