తాజా వార్తలు

10/recent/ticker-posts

లేబర్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి


ఆలమూరు, కొత్తపేట, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: పరిశ్రమలు, ఇటుక బట్టే యాజమానులందరూ లేబర్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని మండపేట అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కాశి శివ నాగ మల్లేశ్వరరావు అన్నారు. ఆలమూరులోని శ్రీ కృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో బుధవారం మండల ఇటుక బట్టీ యజమానులతో అవగాహన సదస్సు జరిగింది. 

ఈసందర్భంగా ఆయన ఈశ్రమ, పీఎంఎస్ వైఎం పెన్షన్ నమోదు, యజమానులుకు వర్తించే కఠినతరమైన చట్టాలగురించి అవగాహన కల్పించారు. యజమానులందరూ కార్మికశాఖ నుంచి లైసెన్స్ పొంది ప్రతియేటా నవీకరణ చేసుకోవాలన్నారు. ప్రతి యేటా జనవరి నెలలో వెల్ఫేర్ ఫండ్ ను చెల్లించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తును జతపరిచి కార్యాలయంలోకి అందజేయాలన్నారు. 

అలాగే కార్మికులకు గుర్తింపు కార్డులను అందజేసి, అవివరాలను కార్యాలయంలో అందజేయాలన్నారు. కార్మికులందరికీ వారంతపు శెలవులను ఖచ్చితంగా ఇవ్వాలని కోరారు. చట్ట అతిక్రమణ చేసిన యజమానులు చట్టరీత్యా తీసుకునే చర్యలకు శిక్షకు భాద్యులవుతారని హెచ్చరించారు. తహసీల్దార్ కెజె.ప్రకాష్ బాబు, ఇటుక బట్టీ యజమానులు పాల్గొన్నారు.