హాజరవుతున్న కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లాల బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, పిక్కి నాగేంద్ర
గోకవరం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: కంబాల స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 19 తేదీ వరకు చత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ సీజన్ -2 నిర్వహిస్తున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు మూడు జిల్లాలకు సంబంధించి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
గోకవరం తంటి కొండ రోడ్డులోని సీఎండీ ప్రాంగణంలో గురువారం రాత్రి 7 గంటలకు ఈ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ కు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాజమహేంద్రవరం జిల్లా అధ్యక్షులు పిక్కినాగేంద్ర, దాట్ల కృష్ణ వర్మలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు.
అలాగే టోర్నమెంట్లో గెలిపొందిన విజేతలకు ట్రోపీలతో పాటు, మొదటి బహుమతి 50 వేలు, రెండొవ బహుమతి 40 వేలు, మూడోవ బహుమతి 30 వేలు, నాలుగోవ బహుమతి 20 వేలు రూపాయలు అలాగే ఈ టోర్నమెంట్లో ఆడిన ప్రతి టీం కూడా బహుమతులు అందజేస్తామని తెలిపారు. కావున నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ఆసక్తి గల ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.







