తాజా వార్తలు

10/recent/ticker-posts

అగ్ని ప్రమాద బాధితులకు కంబాల చేయూత


గోకవరం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేయూత అందించారు. కోరుకొండ మండలం కొత్త జంబూపట్నం గ్రామానికి చెందిన కాకర పల్లి దేవి అనే మహిళా తాటాకిల్లు ఇటీవలే జరిగిన కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. 

ఇంట్లో వంట సామాగ్రి, సామాన్లు మొత్తం దగ్ధమయ్యాయి. ఈ విషయాన్ని జంబూపట్నం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు నాగ రమేష్, శ్రీమతి వీరాంజలి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కిలోల బియ్యం ప్రకటించారు. 

ఆయన అందుబాటులో లేకపోవడంతో వాటిని రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు బుధవారం బాధితుల వద్దకు వెళ్లి వారికి అందజేసీ, పరామర్శించి, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, పెద్దాడ వెంకన్న దొర, చింతల కన్నారావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.