మండపేట పట్టణం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: 20వ వార్డులో నూతన ట్రాన్స్ఫార్మర్ కు మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనిలో ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ పై అధిక లోడు ఎక్కువయ్యి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ నేపద్యంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బుధవారం విద్యుత్తు సిబ్బందితో కలిసి శంకుస్థాపన చేశారు. రానున్న వేసవిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎలక్ట్రికల్ ఏ.ఈ ముని, ఎలక్ట్రికల్ సిబ్బంది, కార్యకర్తలు పిల్లి శివ, బత్తిన దొరబాబు, గనిపే భూషణం, పెనేడ్డి కృపావతి తదితరులు పాల్గొన్నారు.







