తాజా వార్తలు

10/recent/ticker-posts

జగన్ పోవాలి - కాంగ్రెస్ అధికారంలోకి రావాలి


అమలాపురం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: వైసిపి పోవాలని, కాంగ్రెస్ అధికారం లోకి రావాలని, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. కాంగ్రెస్ నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చారని, అయితే జగన్ వ్యవస్థలని నాశనం చేశారని జేడీ శీలం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ అధ్యక్షతన అమలాపురం ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, కష్టపడి పని చేసే వారికి గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు 10 నుండి 12 మంది వరకు పదవులు ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా నిర్మాణం చేసేందుకు ఏఐసీసీ సర్కులర్ పంపించడం జరిగిందని తెలిపారు. 

అమలాపురం రిజర్వుడు కాన్స్టెన్సీ కావున పదవులు కష్టపడి పనిచేసే అన్ని వర్గాల వారికి ఇవ్వాలని సూచించారు. డిసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రతినెల మీటింగ్ జరగాలని,15 రోజులకు ఒకసారి నాయకులు సమీక్షలు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు కోఆర్డినేటర్లతో కలిసి మండల స్థాయి నుండి గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని కోరారు. ప్రతి కార్యకర్త వారి ఫోటోలతో హస్తం గుర్తు ఉండే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల అవసరాలు గుర్తించి, ప్రజల ఆశీర్వాదాలు తీసుకొని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని కోరారు. 

మార్చి నెలలో ఏఐసిసి నాయకులు ఆంధ్రాకు తరలి వస్తారని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు చోట్ల కాంగ్రెస్ మీటింగ్ జరిగే అవకాశం ఉందని, వైయస్ షర్మిల నేతృత్వంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానములు ఎండగట్టడం జరుగుతుందని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఉత్తరాంధ్ర రాయలసీమలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, రఘువీరారెడ్డి గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 

బిజెపి దానిని తుంగలో తొక్కి వికసత్ భారత్ రాంజీ గా మార్చి, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం, వ్యవసాయ కార్మికుల హక్కులు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినవేనని అన్నారు. బిజెపి విధానాలతో ప్రజావ్యతిరేకత మొదలైందని, భారతదేశంలో నిరసన వ్యక్తం అవుతున్నాయని, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కష్టపడి పనిచేస్తున్నారని వారికి సహకరించాలని కార్యకర్తలను కోరారు. 

ఎన్నికల కమిషన్ నేతత్వంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు బిజెపికి అండగా ఉంటున్నారని, వారికి ఇష్టమైన ఓటర్ లను లిస్టులో ఉంచి, ఇష్టం లేని వాటర్ లను తొలగించడం జరుగుతుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయంగా వ్యాపారాలు చేస్తూ ప్రజా వ్యతిరేక చట్టాలను వ్యతిరేకంచడం లేదని అన్నారు. ఎస్టిన్ ఫైల్స్ అక్రమ వ్యాపారాలు చేసే గౌతమ్ ఆదాని, పరదీప్  తదితరులకు కొమ్ముకాస్తూ, అమెరికా ప్రభుత్వానికి దాసోహం అయిపోయారని అన్నారు. 

అఖిలభారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో నియోజకవర్గ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, పూర్వవైభవంపై కసరత్తు చేసి పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముసిని రామకృష్ణ రావు, అమలాపురం కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు ఒంటెద్దు బాబి, నియోజకవర్గ కన్వీనర్ అయితా బత్తుల సుభాషిని, శ్రీమన్నారాయణ, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.