తాజా వార్తలు

10/recent/ticker-posts

తోట త్రిమూర్తులు సోదరుడి మృతి పట్ల వైసీపీ నేతల సంతాపం..


రామచంద్రాపురం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: మండల కేంద్రం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ, రాష్ట్ర సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు సోదరుడు తోట సత్యనారాయణ అకాల మృతి పట్ల అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా  శ్రీకాంత్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును కలిసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో తోట కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు వంగా గీత, కురసాల కన్నబాబు, జక్కంపూడి గణేష్, చీకట్ల కిషోర్, గుమ్మళ్ళ సురేష్, సలాది సతీష్, మానే దుర్గ, మోకా శ్రీనివాసరావు తదితర నియోజకవర్గ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనతో పాటు ఉన్నారు.