తాజా వార్తలు

10/recent/ticker-posts

ఆధ్యాత్మిక జీవనంతో మనోశాంతి - శివోహం కార్యక్రమం విజయవంతం కావాలి..


కొత్తపేట/మంగళగిరి, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనో శాంతి లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని 'మహా గ్రూప్' చైర్మన్ వంశీ కృష్ణ ఆధ్వర్యంలో మంగళగిరిలో అత్యంత వైభవంగా 'శివోహం' కార్యక్రమం నిర్వహించనున్నారు. 

అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సహచర ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, వేగుళ్ళ జోగేశ్వరావులతో కల్సి గురువారం ఎమ్మెల్యే బండారు పరిశీలించారు. అనంతరం వారు వంశీ కృష్ణతో కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వివరాల గురించి చర్చించారు. 

భారీ ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ అభినందనీయమని, శివోహం విజయవంతం కావాలని ఎమ్మెల్యే బండారు తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.