గోకవరం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: గోకవరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన రాజ్ టీవీ విలేఖరి కరాసు శివ మాతృమూర్తి కరాసు సూర్య కుమారి అకాల మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గోకవరంలో వారి ఇంటికి చేరుకుని సూర్య కుమారి మృతి పట్ల సూర్య కుమారి కుటుంబ సభ్యులకు తమ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరాసు లక్ష్మణరావు, ఇళ్ల అప్పారావు కాపు, తుమ్మల చిన్నబ్బు, దొడ్డ విజయ్, బోదిరెడ్డి చక్రరావు, చింతల అనిల్, కసిరెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు.







