డాక్టర్ అంబేద్కర్ కోనసిమ, రామచంద్రపురం: రామచంద్రపురంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం (5-1-2026) మీకోసం కార్యక్రమం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్‌రెస్సల్ సిస్టమ్ – పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం ఆరు అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా వచ్చిన అర్జీలలో, కోట గ్రామం, కె.గంగవరం మండలం నుంచి అక్రమ ఇసుక త్రవ్వకాల్ని నిలుపుదల చేయాలన్న వినతులు అందాయి. అలాగే కె.గంగవరం మండలం దంగేరు గ్రామంలో 50 గేదెలతో ఏర్పాటు చేసిన పాడి పరిశ్రమ వల్ల పక్కన నివసించే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, దానిని తొలగించాలంటూ అర్జీలు వచ్చాయి.
రామచంద్రపురం పట్టణం మరియు మండలం నుంచి భవన నిర్మాణంలో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వినతులు అందాయి. అదే విధంగా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం నుంచి ప్రభుత్వ కార్యాలయాలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని అర్జీ సమర్పించారు.
అలాగే నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ప్రభుత్వ భూములను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, రామచంద్రపురం పట్టణం మరియు మండల పరిధిలో ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరుతూ అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ అర్జీలను పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.







