మలకపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘన ప్రారంభం
తాళ్లపూడి మండలం: మలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సొసైటీ ప్రముఖ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమా ఫోటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి వంటి పండుగలు మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయని, ముగ్గులు మహిళల సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు జొన్నలగడ్డ చౌదరి, పెద్దేవం టిడిపి నాయకులు, అలాగే జనసేన నాయకులు కల్లూరు సుబ్రహ్మణ్యం, నామన చిన్న బురయ్య, సాయన్న, సుబ్బారావు పాల్గొని పోటీలకు తమ మద్దతు తెలిపారు. అలాగే టిడిపి నాయకులు బోడపాటి గంగరాజు, కోడి శంకరం తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
పోటీల్లో పాల్గొన్న మహిళలు రంగురంగుల ముగ్గులతో పాఠశాల ప్రాంగణాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించగా, నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

.jpeg)






