తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి


 ఏలూరు, మార్చి 02: స్థానిక న్యాయసేవా అధికార సంస్థ భవనము నందు సోమవారం మార్చి 08వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారం రోజులు పాటు నిర్వహించే అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ భవనము నందు మహిళలకు చట్టాలుపైన అవగాహన సదస్సును నిర్వహించామని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ చట్టాలుపైన అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పైన మహిళలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. అందులో భాగంగా న్యాయ సేవాధికార సంస్థలు అందించి ఉచిత న్యాయ సేవలు మరియు మహిళా చట్టాలుపైన అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనమునందు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మహిళలకు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమయ్యే ఉచిత న్యాయ సేవలను న్యాయ సేవాధికార సంస్థలు అందిస్తున్నాయని అలాగే మహిళా ఉద్యోగులు, కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో ఎదురయ్యే లైంగిక వేధింపులను పోష్ చట్టం ద్వారా ఎదుర్కోనవచ్చని తెలియ జేశారు. ప్రస్తుత సమాజంలో బాల్య వివాహాలు వల్ల మహిళలు మానసిక పరిపక్వత లేక కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్కరూ ఈ సమస్య నుండి మహిళలు రక్షించడం కోసం కృషి చెయ్యాలని సూచించారు. ఎటువంటి న్యాయ సమస్యలు లేదా సందేహాలు ఉన్న 15100 ఉచిత టోల్ ఫ్రీ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. 

మహిళా పోలీసు వింగు డిప్యూటీ సూపర్డెంటు ఆఫ్ పోలీసు రవిచంద్ర మాట్లాడుతూ చట్టాలను సరైన మార్గంలో ఉపయోగించు కున్నప్పుడు మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. చట్టాలను దుర్వినియోగం చెయ్యకూడదని, మహిళా పోలీసు స్టేషన్లు మహిళలు సమస్యలను పరిష్కరించ డానికి ప్రతినిత్యం కృషి చేస్తున్నామని తెలిపారు.కావున సమస్యలను సామరస్య వాతావరణంలో పరీక్షించుకోవడం ఉత్తమమని సూచించారు. 
      
జిల్లా ఐసిడిఎస్ పిడి పి.శారద మాట్లాడుతూ మహిళలు సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో పయనించాలని సూచించారు. మహిళా సమస్యలను పరిష్కరించ డానికి న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థతోపాటు సంబంధిత ప్రభుత్వ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి ఇన్చార్జ్ చైర్పర్సన్ పి.వెంకటేశ్వర రావు, మెడికల్ డిపార్ట్మెంటు శ్రీమతి జ్యోతి, సిడిపిఓలు శ్రీమతి పద్మావతి, శ్రీమతి తులసి, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.