ఉంగుటూరు నియోజకవర్గం, భీమడోలు మండలం, భీమడోలు గ్రామం – ఏలూరు పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 23:
కేంద్ర మాజీ మంత్రివర్యులు కీ.శే. కింజరపు ఎర్రనాయుడు గారి జయంతి సందర్భంగా భీమడోలు గ్రామంలోని వెలమపేట వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో గన్ని నాగగోపాలరావు, దూసనపూడి పుల్లయ్యనాయుడు, శేషపు శేషగిరి, ఆదిరెడ్డి సత్యనారాయణ, గేదెల శ్రీనివాసరావు, కుక్కల ప్రసాద్, కమ్మ పద్మ, బూర్లు రామకృష్ణ, శణపతి అంబికా, చింతల జయలక్ష్మి, ఈదుపల్లి కళ్యాణ్, గుల్ల మురళీకృష్ణ, తోత్తల శ్రీను, తాటిమల్ల రామ్మూర్తి, ఎర్రంశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.
అలాగే బీజేపీ నాయకులు ప్రవీణ్ కుమార్ పటేల్, తవ్వా చిన్నబాబు కూడా కార్యక్రమంలో పాల్గొని ఎర్రనాయుడు గారి సేవలను స్మరించుకున్నారు. నాయకులు మాట్లాడుతూ ఎర్రనాయుడు గారు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడని, ఆయన ఆలోచనలు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.








