Hot Posts

6/recent/ticker-posts

పెద్దిరెడ్డికి బిగ్ షాక్... పోగేసుకున్న ఇసుక నిల్వలు సీజ్!


ANDRAPRADESH, PEDDIREDDR NEWS: మాజీమంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి తాజాగా ఏపీ సర్కార్ షాకిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఈయన సాగించిన వ్యవహారాలు అన్నీ, ఇన్నీ కాదంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ విషయం తాజాగా వెలుగుచూసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు షాకిచ్చారు. ఆయన భారీగా పోగేసుకున్న ఇసుక నిల్వలు సీజ్ చేశారు.


అవును... మాజీమంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏపీ అధికారులు షాకిచ్చారు. ఇందులో భాగంగా ఆయన గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున పోగేసిన ఇసుక నిల్వలను సీజ్ చేశారు. అప్పట్లో నిత్యం సుమారు 100 టిప్పర్ల ఇసుకను తరలించి ఈ నిల్వలు చేశారని అంటున్నారు. రాత్రింబవళ్లు నాడు యదేచ్చగా ఈ విషయంలో జరిగేవని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... 2022లో అప్పట్లో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన పీ.ఎల్.ఆర్. కంపెనీ వాహనాలతో పీటీఎం మండలం సంగమేశ్వరస్వామి ఆలయ సమీపంలోని పాపఘ్ని నదిలో తవ్వి, తంబళ్లపల్లెకు వెళ్లే మార్గంలో రెడ్డివారిపల్లి సమీపంలో రాశులుగా పోశారు.

ఇదే సమయంలో... వైస్సార్ జిల్లా గండికోట జలాశయం నీటిని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కు తరలించేందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టారు. ఇందులో భాగంగా గాలేరి - నగరి కాలువతో హంద్రీ-నీవా కాలువ అనుసంధానం కోసం పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకల చెరువు మీదుగా పనులు ప్రారంభించారు. ఈ పనుల పేరుమీదే భారీగా ఇసుక పోగేశారు.

అయితే గతకొన్ని నెలలుగా వీటికి సంబంధించిన పనులు జరగడం లేదు. దీంతో... అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం రెడ్డివారిపల్లి సమీపంలోని ఇసుకను సీజ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీంతో... గనులు, జలవనరులు, రెవిన్యూ శాఖలతో పాటు సెబ్ అధికారులు కలిసి ఈ ఇసుక డంప్ లను జప్తు చేశారు.