నూజివీడు/ఏలూరు, ఫిబ్రవరి, 22: నూజివీడు పట్టణంలో వెలమ పేట రెండవ వార్డులో సుమారు:రూ.25 లక్షలతో రజక కమ్యూనిటీ హాలు శంకుస్థాపన చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి. అనంతరం మంత్రి వర్యులు మాట్లాడుతూ ముఖ్యంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ త్వరలో ఒక్కొక్కటిగా నెరవేస్తామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
బడుగు బలహీన వసర్గాల అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం సుమారు. రూ.52 వేల కోట్లు కేటాయించిందన్నారు. బి, సి, వర్గాల కుల వృత్తి పలు రకాల చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంచి వారి ఆర్ధిక అభివృద్ధికి సబ్సిటీతో కూడిన రుణాలు అందిస్తున్నదని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామన్నారు. బి, సి, కమ్యూనిటి హాలుకు రూ.50లక్షలు. ఇతర కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.30 నుండి 50లక్షలు కేటాయించి త్వరలో పూర్తిచేస్తామన్నారు.
అలాగే కాపు కమ్యూనిటి హలు కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. బడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్ధిక అభివృద్ధి కి వివిధ పథకాల ద్వారా ఆర్ధిక ఋణాలు అందిస్తున్నామన్నారు.బడుగు బలహీన వర్గాలు వ్యాపార అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేలకోట్ల కటాయించిదని బ్యాంకు రుణాలు అందించడానికి నా వంతు సహాయ సహకారం అందిస్తామన్నారు. మరియు ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించుటకు కూటమి నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ముఖ్య సమస్యల్లో ఒకటైన ధోబి గాడ్స్ విద్యుత్ బిల్లులు రాయితీ కల్పించాలని. జీవో నెంబర్ 111 అమలు చేయాడానికి కృషి చేస్తామన్నారు. దోబీగార్డులు ఇచ్చే విద్యుత్ రాయితీ అమలు చేయాడానికి కృషి చేస్తామన్నారు. చట్టసభల్లో దామాస ప్రకారం స్థానం కల్పించాడానికి. లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎన్నికల్లో పంచాయతీ మరియు జెడ్పిటిసి స్థానాల్లో అవకాశం కల్పించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు డి, రామారావు,తిరుమల తిరుపతి డైరెక్టర్, డి, శ్రీనివాసరావు రజక సోదరులు కూటమి నాయకులు.తదితరులు పాల్గొన్నారు.







