చింతలపూడి, జనవరి 3 (పశ్చిమ వాహిని): ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతున్న వారు లైఫ్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా సకాలంలో సమర్పించాలని చింతలపూడి సబ్ ట్రెజరీ అధికారి (ఎస్‌టీఓ) కె. కాశి సూచించారు.
జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు గడువు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ గడువు లోపల అన్ని పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కోరారు.
పెన్షనర్లు సబ్ ట్రెజరీ కార్యాలయం, పోస్టాఫీస్‌లలో లేదా ఆన్లైన్ విధానంలో కూడా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చని ఎస్‌టీఓ కాశి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని పెన్షనర్లు పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.







