తాజా వార్తలు

10/recent/ticker-posts

పేద పురోహితునికి రూ. 10 వేలు ఆర్ధిక సాయం చేసిన మంత్రి సుభాష్


పురోహితులకు అండగా కూటమి ప్రభుత్వం


రామచంద్రపురం, 03 జనవరి 2026(పశ్చిమ వాహిని): దాక్షారామంలోని నిరుపేద  పురోహితుడు కావుటూరి సీతారాంకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. సీతారాం గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. 

ఆయన ఆర్థిక, జీవన స్థితిగతులను తెలుసుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆయన కుటుంబ జీవనం కోసం ప్రతినెల రూ. 10 వేలు రూపాయలు సహాయం చేస్తానని మాట ఇచ్చి గత నాలుగు నెలలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 

ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ పేద పురోహితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే పేద పురో హితులకు నెలకు గౌరవ వేతనం కింద 3 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.