INDIA NEWS, GUJARATH CM YOGI: ఇటీవలి కాలంలో యోగీ ఆదిత్యనాథ్ పేరు రాజకీయంగా పెద్దగా వినిపించడం ప్రారంభమైంది. ఇప్పటివరకు మీడియాకు పెద్దగా దూరంగా ఉన్న యోగీ, ఇప్పుడు అన్ని వార్తా ఛానళ్లలో కూడా హాట్ టాపిక్‌గా మారారు. ప్రధాని మోడీకి ఇంకో నాలుగు సంవత్సరాల అధికార కాలం మిగిలి ఉన్నప్పటికీ, ఆయన వారసుడిగా యోగీ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యోగీని జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఒక వ్యూహాత్మక ప్రణాళిక నడుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్ష స్థానంలో మార్పుల సూచన
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పూర్తయినప్పటికీ, ఇంకా కొనసాగుతున్నారు. కానీ, పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టే కొత్త నాయకుడెవరు అన్న దానిపై ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో యోగీ పేరు వినిపించడమొక కీలక పరిణామంగా భావిస్తున్నారు. గతంలో వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు ఈ పీఠాన్ని అలంకరించిన సంగతి తెలిసిందే.
బీజేపీ – ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరుగుతోందా?
బీజేపీకి ఆదర్శసూత్రాలు అందించిన ఆర్ఎస్ఎస్‌తో సంబంధాల్లో ఇటీవల పతనం వచ్చిందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బీజేపీ నిర్ణయాలు, కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర తగ్గిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంఘ్ అభిమతానికి భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోడీ వయస్సు... ఆర్ఎస్ఎస్ ప్రకటనలో పరోక్షంగా సూచనా?
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటన – "75 ఏళ్లు నిండిన నాయకులు రాజకీయాలనుంచి తప్పుకోవాలి" అన్న వ్యాఖ్య పెద్ద దుమారానికే దారి తీసింది. మోడీ సెప్టెంబరు 2025లో 75వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రకటన మోడీపైనేనా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీలో గతంలో 75 ఏళ్లు దాటిన నేతల్ని పక్కన పెట్టిన విధానం మళ్లీ అన్వయమవుతుందా అన్నది ప్రశ్నగా మారింది.
అమిత్ షాతోనూ గాపు ఏర్పడిందా?
మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆర్ఎస్ఎస్‌కు అంతగా పడడం లేదన్న మాటలూ వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం అయినా సరే, అసలు ఆదేశాలు, కార్యాచరణలు అమిత్ షా నుంచే వస్తున్నాయన్న విమర్శలున్నాయి. పార్టీని కూడా ఆయననే కంట్రోల్ చేస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది అనే భావన ఆర్ఎస్ఎస్‌లో ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఢల్లీ సీఎం ఎపిసోడ్ – బాహ్యప్రభావాల సంకేతమా?
ఢల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపిక కావడం కూడా ఆర్ఎస్ఎస్ ప్రమేయంతోనే జరిగిందని అంటున్నారు. మోడీ, అమిత్ షా వేరే పేర్లను అనుకూలంగా భావించగా, ఆర్ఎస్ఎస్ రేఖా గుప్తాను ముందుకు తెచ్చింది. దీనిపై విశ్లేషకులు ‘మోడీ-షా వర్సెస్ ఆర్ఎస్ఎస్’ అనే అంశాన్ని లెవల్‌లో చర్చిస్తున్నారు.
బీజేపీ పీఠంపై పోరాటం – లక్ష్యం యోగీనా?
జాతీయ అధ్యక్ష స్థానాన్ని ఎవరు చేపట్టాలి అన్నదానిపై బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అయితే తన నుంచి వచ్చినవారికి ఆ పదవి ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు, మోడీ-షా మాత్రం ఒక మహిళ నేతను ఆ పదవిలో కూర్చోబెట్టి సంఘ్ ప్రభావాన్ని తగ్గించాలని చూస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఇక యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న యోగీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ప్రయత్నం చాలా కాలంగా మోడీ-షా ప్లాన్‌లో ఉందని అంటున్నారు. ఒకే స్ట్రాటజీలో రెండు టార్గెట్లను సాధించేందుకు –
బీజేపీ అధ్యక్ష పదవి
యోగీకి ఇచ్చే ప్లాన్ ముందుకు తెస్తున్నారని అంటున్నారు. ఒకవైపు ఆర్ఎస్ఎస్ అభిమతానికి అనుగుణంగా నాయకుడిని నియమించినట్టవుతుంది. మరోవైపు యూపీ సీఎం పదవిలో యోగీని తొలగించినట్టయిపోతుంది. ఈ వ్యూహం సాకారమైతే – యోగీకి యూపీకి గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.