Hot Posts

6/recent/ticker-posts

మంత్రి నారా లోకేష్ తో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భేటీ.


ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సమస్యలు యువనేత దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ మహేష్ కుమార్.
ఆయా అభివృద్ధి పనులకు విధులు మంజూరు చేయాలని కోరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్.


‎ఏలూరు/అమరావతి:  ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను  ఉండవల్లిలో ఆయన  నివాసంలో కలిశారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పలు విషయాలు పై చర్చించి మంత్రి లోకేష్ కు వినతిపత్రం అందించారు.
వేలేరుపాడులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని, నూజివీడు ఐఐఐటి కి రూ: 12.17 కోట్లు, ఏలూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ: 12.60 కోట్లు, ఏలూరులోని జిల్లా గ్రంధాలయ సంస్థకు కొత్త భవనం నిర్మాణం కోసం రూ: 3 కోట్లు మంజూరు చేయవలసిందిగా ఎంపీ కోరడం జరిగింది. అంతేగాకుండా, వెనుకబడ్డ గిరిజన ప్రాంతం కొయ్యలగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఒక ఫైర్ స్టేషన్ కూడా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రి నారా లోకేష్ ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.

‎వీటితోపాటు మరికొన్ని అంశాలను కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఎంపీ పుట్టా మహేష్. వీటిలో CMRF నిధుల విడుదలలో ఆలస్యం, పామాయిల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, కోకో రైతుల సమస్య, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కి కొల్లేరు రిపోర్ట్ అందించటం, పెండింగ్ లో ఉన్న సత్యసాయి (CPWS) స్కీమ్ వర్కర్ల జీతాలు, వంటి మరికొన్ని విషయాలను మంత్రి నారా లోకేష్ దృష్టికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీసుకెళ్లారు.

అనంతరం యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని మంత్రి నారా లోకేష్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు బహుకరించడం జరిగింది. విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని, వీలైనంత త్వరలో అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ పుట్టా మహేష్ ఒక ప్రకటన లో తెలిపారు.