తాజా వార్తలు

10/recent/ticker-posts

గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రజా రవాణాకు అనుసంధానం చేయాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రవి


టి. నరసాపురం, ఫిబ్రవరి 24: టి. నరసాపురం మండల కమిటీ సమావేశం సరియన్ దుర్గమ్మ గుడెల్లి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ. రవి ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై మాట్లాడారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవేను కేవలం సరుకు రవాణా కోసం మాత్రమే కాకుండా ప్రజా రవాణాకు అనుసంధానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా అండర్‌పాస్‌లు నిర్మించి, అనుసంధాన రహదారులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో అమలవుతున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం మరియు పోతల కాలువ పనుల కారణంగా రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేసి, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

టీ.నర్సాపురం మండలంలోని సమస్యలపై రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన పర్యటించి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల్లో పేరుకుపోయిన మౌలిక వసతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు మడకం కుమారి, శిరీష, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.