Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో తేలిన కొత్త జిల్లాల లెక్క ! వాటిలోకి వచ్చే నియోజకవర్గాలు ఇవే?


ANDHRPRADESH:ఏపీలో కూటమి సర్కార్ జిల్లాల సరిహద్దుల్ని మార్చడంతో పాటు నియోజకవర్గాలను కూడా వివిధ జిల్లాల్లోకి మార్చేందుకు కసరత్తు పూర్తి చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో ఉన్న పలు నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లోకి వెళ్లడంతో పాటు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. మళ్లీ వాటి పరిధిలోకి కొన్ని నియోజకవర్గాలు రాబోతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల్ని జిల్లాలుగా మారుస్తూ చేసిన మార్పును ఇప్పుడు సరిదిద్దబోతున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మొత్తం 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లా కేంద్రాలు కాబోతున్నట్లు సమాచారం.

పలాస జిల్లాలో ఇచ్చాపురం,, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు ఉండే అవకాశముంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, టెక్కలి, రాజాం ఉండే అవకాశముంది. పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు వస్తాయి. విజయనగరం జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్ కోట, బొబ్బిలి రానున్నాయి.

అలాగే విశాఖ జిల్లాలోకి భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, పెందుర్తి సీట్లు వస్తాయని తెలుస్తోంది. అరకు జిల్లాలో అరకు, పాడేరు, మాడుగుల సీట్లు వస్తాయి. అనకాపల్లిలోకి అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని వస్తాయి. అలాగే కాకినాడ జిల్లాలోకి ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, రూరల్, రామచంద్రాపురం వస్తాయి.

రాజమండ్రి కేంద్రంగా ఉండే జిల్లాలోకి అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు రానున్నాయి. అమలాపురం జిల్లాలోకి రాజోలు, అమలాపురం, ముమ్మడివరం, పి.గన్నవరం, మండపేట, కొత్తపేట రానున్నాయి. నరసాపురం జిల్లాలోకి తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం వస్తాయి. ఏలూరు జిల్లాలోకి గోపాలపురం,పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు వస్తాయని తెలుస్తోంది.

మచిలీపట్నంలోకి కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు సీట్లు వస్తాయని తెలుస్తోంది. విజయవాడ జిల్లాలోకి తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం రానున్నాయి. అలాగే అమరావతి జిల్లా పరిధిలోకి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ రానున్నాయి. గుంటూరు జిల్లా పరిధిలోకి తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, వెస్ట్, పొన్నూరు వస్తాయి.

బాపట్ల పరిధిలోకి రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు రానున్నాయి. నరసరావుపేట పరిధిలోకి చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ సీట్లు వస్తాయి. మార్కాపురం పరిధిలోకి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి వస్తాయి. ఒంగోలు పరిధిలోకి అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు సీట్లు వస్తాయని తెలుస్తోంది.

నెల్లూరు పరిధిలోకి కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి వస్తాయని తెలుస్తోంది. గూడూరు జిల్లా పరిధిలోకి సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట సీట్లు వస్తాయి. తిరుపతి జిల్లా పరిధిలోకి శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి వస్తాయి. చిత్తూరు జిల్లా పరిధిలోకి పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం వస్తాయి. మదనపల్లె జిల్లా పరిధిలోకి పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె వస్తాయి.

హిందూపురం పరిధిలోకి కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర, హిందూపురం వస్తాయి. అనంతపురం పరిధిలోకి రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి వస్తాయి. ఆదోని జిల్లా పరిధిలోకి పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం వస్తాయి. కర్నూలు జిల్లా పరిధిలోకి నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు వస్తాయి. నంద్యాల పరిధిలోకి శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం వస్తాయి. కడప జిల్లా పరిధిలోకి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప వస్తాయి. రాజంపేట జిల్లా పరిధిలోకి బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి రానున్నాయి. ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.