ఈ సమయంలో లులు మాల్స్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. విశాఖ, విజయవాడల్లో మాల్స్ ఏర్పాటుకు కీలక ముందడుగు వేసింది.
AMARAVATI:అమరావతి పరిసర ప్రాంతాలతో పాటు విశాఖ అభివృద్ధి విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని కూటమి ప్రభుత్వం చెబుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో లులు మాల్స్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. విశాఖ, విజయవాడల్లో మాల్స్ ఏర్పాటుకు కీలక ముందడుగు వేసింది.
అవును... అన్ని ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కూటమి ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఆ సంస్థకు రెండు నగరాల్లోనూ భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలో... విశాఖ బీచ్ రోడ్ లోని హార్బర్ పార్క్ లో 'లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేటు లిమిటెడ్'కు 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా కేటాయించింది. ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు.
ఈ సమయంలో... ఈ ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తూ మూడేళ్ల లీజు మాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో... రాష్ట్ర పర్యాటక భూముల కేటాయింపు విధానం 2024-29 ప్రకారం లులు మాల్స్ కు భూమి ధరను నిర్ధారించనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కేసుల పరిష్కారానికి ఏపీఐఐసీ, రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక విజయవాడలోని లులు మాల్ విషయానికొస్తే... ఇక్కడ 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు 4.15 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించేందుకు అంగీకారం తెలిపింది! ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సూచించిన ప్రాంతంలోని ఆర్టీసీ నిర్మాణాలను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.