అదే ఆయన మొదటి చివరి మంత్రి పదవి. ఆ తరువాత ఆయన టీడీపీ నుంచి 1999, 2009లలో మరో రెండు సార్లు గెలిచారు.
ANDHRAPRADESH,NELLURU:వైసీపీకి సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. అయితే మంత్రులుగా అనేక సార్లు ఎమ్మెల్యేగా చేసిన వారు పార్టీని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యతను పక్కన పెట్టి కొత్త వివాదాలలో తాము పడుతూ పార్టీని కూడా అందులో పడేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దూకుడు రాజకీయాలు చేస్తారని అంటారు. ఆయన ఫైర్ బ్రాండ్ గానే ఉంటూ వస్తున్నారు.
ఆయన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి 1994 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ద్వారా కోవూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎమ్మెల్యే అయింది టీడీపీ నుంచి. అలా ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో అన్న ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
అదే ఆయన మొదటి చివరి మంత్రి పదవి. ఆ తరువాత ఆయన టీడీపీ నుంచి 1999, 2009లలో మరో రెండు సార్లు గెలిచారు. వైఎస్సార్ మరణంతో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. 2012లో ఆయన టీడీపీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. అయితే 2014లో మరోసారి ఓడారు. 2019లో గెలిచి 2024లో ఓడారు. ఇలా మొత్తం తన రాజకీయ జీవితంలో అయిదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఒకసారి మంత్రిగా చేశారు.
ఆరు పదులు దాటిన ఆయన ఎంత బాధ్యతగా ఉండాలి, తన నోటి దూకుడుతో ఆయన తనకే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారా అన్న చర్చ అవుతోంది. ఒక మహిళా ఎమ్మెల్యే మీద విమర్శలు చేసే ముందు అన్నీ ఆలోచించుకోవాలి కదా అని అంటున్నారు. తన మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు వైసీపీ నేతలు వారి ఇంట్లో ఆడవారికి చూపించాలని టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అంటున్నారు అంటే అవి ఎంత ఏహ్య భావాన్ని కలిగిస్తాయో అన్నది ఆలోచించాల్సిందే.
నిజానికి కోవూరు ఆన్నది నల్లపురెడ్డి కుటుంబానికి కంచుకోట లాంటిది. దివంగత శ్రీనివాసులు రెడ్డి ఆ సీటు నుంచి మొత్తం మూడు సార్లు గెలిచారు. ఆయన టీడీపీలో అన్న ఎన్టీఆర్ కి ఎంతో సన్నిహితంగా ఉంటూ కీలక మంత్రి పదవులు నిర్వహించారు. మంచి ధాటి ఉన్న నేతగా శ్రీనివాసులు రెడ్డి గుర్తింపు పొందారు. ఆయన వారసుడిగా కోవూరు జనంలో అంతే గుర్తింపు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉంది.
అయితే ఆయన తన వ్యవహార శైలి వల్లనే పార్టీకి తనకూ ఇబ్బందులు తెస్తున్నారా అని అంటున్నారు. ఇక ఆయన మహిళా ఎమ్మెల్యే మీద వాడిన భాష ఎంత దారుణంగా ఉందో ఆయన ఇంటి మీద జరిగిన దాడి అంతే దారుణంగా ఉంది అని అంటున్నారు. ఒక్క వస్తువు కూడా ఉంచకుండా మొత్తానికి మొత్తం సర్వ నాశనం చేసారు. ఇలా కక్ష తీర్చుకున్న వారు ఎవరు అంటే జవాబు అయితే లేదు. ఇది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రభాకర్ రెడ్డి పనే అని వైసీపీ నేతలు ఆరోపిస్తూంటే తనకు ఏమీ సంబంధం లేదని ప్రశాంతి రెడ్డి అంటున్నారు, ప్రసన్న రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎందరినో బాధపెట్టారని వారిలో ఎవరో ఒకరు వచ్చి ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు అని ఆమె అనడం విశేషం.

Shakir Babji Shaik
Editor | Amaravathi