Hot Posts

6/recent/ticker-posts

అన్యమత ఉద్యోగులపై టీటీడీ సంచలన నిర్ణయం - ఒకేసారి ..!!


ANDHRAPRADESH:టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగుల ను తప్పించాలని కొంత కాలంగా డిమాండ్ పెరుగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. వారిని తప్పించాలని డిమాండ్ చేసారు. కాగా, వీరి విషయంలో పరిశీలన చేసిన టీటీడీ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వారి పైన వేటు వేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవటంతో.. ఇదే తరహా లో ఉన్న మిగిలిన వారి పైన చర్యలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. టీటీడీలో పనిచేస్తున్న శ్రీ బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( క్వాలిటీ కంట్రోల్), శ్రీమతి ఎస్. రోసి, స్టాప్ నర్స్, బర్డ్ ఆసుపత్రి, శ్రీమతి ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ , బర్డ్ ఆసుపత్రి, అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ లలో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను టిటిడి సస్పెండ్ చేసింది. ఈ నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వీరి పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావ ళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులు గా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో టీటీడీ విజి లెన్స్ విభాగం సమర్పించిన నివేదికను..ఇతర ఆధారాలను పరిశీలించిన తరువాత నిబంధనల మేరకు వారి పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవటంతో పాటుగా ఆ నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేస్తూ టీటీడీ నిర్ణయ తీసుకుంది.