Hot Posts

6/recent/ticker-posts

దోసె గొంతులో ఇరుక్కొని రెండేళ్ల బాలుడు మృతి..!


ANDHRAPRADESH:ప్రాణం అంటే నీటి బుడగ లాంటిది.. గాల్లో దీపం లాంటిది అంటూ పెద్దలు సామెతలు చెబుతూ ఉంటారు. కానీ ఈ తరహా ఘటనలు చూసినప్పుడే అది నిజం అనిపిస్తూ ఉంటది.

దోశ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ రెండేళ్ల బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విపిస్తున్నారు. ఓ విషాద ఘటన జనాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. అనంతపురం పట్టణంలోని తపోవనంలో అభిషేక్, అంజినమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుశార్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే శుక్రవారం ఉదయం ఇద్దరు దంపతులు కొడుకుతో పాటు టిఫన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కుశార్‌కు దోశ ముక్క ఇవ్వగా, అది అనుకోకుండా అతని గొంతులో ఇరుక్కుపోయింది. కొద్ది క్షణాల్లోనే ఊపిరాడక.. ఆ చిన్నారి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

వెంటనే కుమారుడు పడిపోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటీన బాలుడిని తీసుకొని స్థానిక హాస్పిటల్‌కు వెళ్లారు. అయితే వైద్యులు తీవ్రంగా శ్రమించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషాద ఘటన వారి తల్లిదండ్రులతో పాటు తెలిసిన వారిని కూడా కలత చెందిస్తుంది. చిన్న ఘటన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పిల్లల భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని తెలియజెప్పుతుంది

గతంలో ఘటనలు..

నెల్లూరు జిల్లా కావలి మండలంలో ఓ తల్లి తన 3 సంవత్సరాల బిడ్డకు ఉదయాన్నే బనానా తినిపించింది. తినే క్రమంలో అరటి ముక్క గొంతులో ఇరుక్కొని బాలుడు ఊపిరాడక కుప్పకూలిపోయాడు. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే గుండె ఆగిపోయిందని వైద్యులు చెప్పారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ తల్లి నాలుగేళ్ల బిడ్డకు భోజనం చేయిస్తూ ఉండగా.. అన్నం గొంతులో ఇరుక్కొని ఊపిరాడకుండా చిన్నారి స్పృహ కోల్పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

తెలంగాణలో కూడా మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి చెందారు.