కప్పలబండ పారిశ్రామిక వాడకు చేరుకున్న మంత్రి
స్థానికులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన లోకేశ్
వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ
ANDHRAPRADESH:శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం-2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ రోజు ఉదయం పుట్టపర్తి చేరుకున్నారు. కప్పలబండలోని పారిశ్రామిక వాడలో ప్రజలు, కార్యకర్తలను మంత్రి కలుసుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరితో కలిసి ఫోటోలు దిగారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కడపలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు మంత్రి నారా లోకేశ్ ను కలుసుకున్నారు. యూనివర్సిటీ గుర్తింపు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేశ్.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ‘మీరు చదువుపై దృష్టి పెట్టండి, మీ భవిష్యత్తును నేను చూసుకుంటా’ అంటూ వారికి ధైర్యం చెప్పారు. విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఈ దిశగా యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi