Hot Posts

6/recent/ticker-posts

విశాఖ కేంద్రంగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం, ఇక..!!


ANDHRAPRADESH:విశాఖ రైల్వే జోన్ అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు తో పాటుగా పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభానికి వీలుగా రైల్వే అధికారులు పలు ప్రతిపాదనలు చేసారు. తాజాగా జోన్ డీపీఆర్ కు రైల్వే బోర్డు ఆమోద ముద్ర వేసింది. జోన్ ఆస్తులు.. పోస్టుల పైన స్పష్టత ఇచ్చింది. కొత్తగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల విషయంలోనూ కీలక సూచనలు చేసింది. తాజా డీపీఆర్ అమలకు అనుగుణంగా రైల్వే బోర్డు నుంచి జోనల్ మేనేజర్ కు మార్గదర్శ కాలు అందాయి.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో ప్రారంభం దిశగా కసరత్తు జరుగుతోంది. జోన్ కార్యకలాపాల్లో కీలకమైన ఆస్తులు... పోస్టుల విషయం పైన రైల్వే బోర్డు స్పష్టత ఇచ్చింది. ఆ కొత్త జోన్ పరిధిలోకి గుంటూరు, గుంతకల్, విజయవాడ, విశాఖ డివిజన్లు రానున్నాయి. అదే విధంగా జోన్ పరిధిలో ఉన్న పలు ఆస్తులు, పోస్టులు, ఉద్యోగులను సౌత్ కోస్ట్ జోన్‌కు బదిలీ చేయడంపై రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త జోన్ నిర్మాణానికి మరిన్ని మౌలిక వసతులు అవసరమవుతాయని.. ఇందుకోసం రూ. 200 కోట్ల మేరకు అదనపు నిధుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

తాజా ప్రతిపాదనలు పరిశీలన దశలో ఉన్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ జోన్ కోసం జనరల్ మేనేజర్ స్థాయి పోస్టు మినహా, ఇతర గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు సృష్టించవద్దని స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే ఉన్న ఉద్యోగులనే బదిలీ చేసి, అందుబాటులో ఉండే మానవ వనరులను వినియోగించాలని కేంద్రం దిశానిర్దేశం ఇచ్చింది. పనిచేస్తున్న డివిజన్‌లోనే సిబ్బంది కొనసాగా లని, ఎవరూ బలవంతంగా వేరే ప్రాంతానికి పంపవద్దని బోర్డు స్పష్టం చేసింది. ఈ విధంగా ఉద్యో గుల సీనియారిటీ, స్థానికతకు అనుగుణంగా విభజన జరగనుంది. విశాఖపట్నం నుంచే కొత్త జోన్ పనులు కొనసాగుతాయి. ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన సిబ్బందిని ఇప్పటికే డీపీఆర్ లో ప్రతిపాదించినట్టు సమాచారం. జోన్ జీఎం నియామకం ఖరారు కావటంతో.. ఇక, కార్యాచరణ వేగవంతం కానుంది.