ఈ రోజు సాయంత్రం 5.15 గంటలకు పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్
రేపు ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్
రేపు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరించనున్న జగన్
ANDHRAPRADESH:వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జగన్ బెంగళూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ రోజు రాత్రి పులివెందులలోనే బస చేస్తారు.
రేపు (మంగళవారం) ఉదయం వైఎస్ జగన్ 6.45 గంటలకు పులివెందులలోని తన స్వగృహం నుంచి వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
అనంతరం 8.45 గంటలకు పులివెందులలోని క్యాంప్ కార్యాలయానికి జగన్ చేరుకుంటారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలిసి వారి నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం పులివెందుల నుంచి 3.50 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు బెంగళూరు చేరుకుంటారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi